రామ్ గోపాల్ వర్మ 'అడవి'
నితిన్, ప్రియాంక కొఠారి ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో హిందీలో రూపొందుతున్న చిత్రం 'అజ్ఞాత్'. దీనిని 'అడవి' పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేయనున్నారు. యుటివి మోషన్ పిక్చర్స్ సమర్పణలో ఎ డ్రీమ్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఆర్.స్క్రూవాలా, రామ్ గోపాల్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారంనాడు ఆ వివరాలను చిత్రయూనిట్ తెలియజేసింది. వర్మ, నితిన్, ప్రియాంక కొఠారి పాల్గొన్నారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, 'శివ' చిత్రంతో తన కెరీర్ మొదలైనప్పటి నుంచి థ్రిల్లర్ చిత్రాలంటే తనకెంతో ఇష్టమనీ, సైకలాజికల్ డ్రామాగా 'అడవి' చిత్రం రూపొందుతోందనీ చెప్పారు. కథాపరంగా ఒక సినిమా షూటింగ్ కోసం యూనిట్ మొత్తం ఓ అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఓ అజ్ఞాత శక్తి ఒక్కొక్కరిని హతమరుస్తుంటుంది. అందరికీ ప్రాణభయం పట్టుకుంటుంది. కెమెరా ముందు హీరోయిజం ప్రదర్శించే హీరో పిరికివాడవుతాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆ శక్తిని ఎదుర్కొని హీరోయిజం ప్రదర్శిస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రను నితిన్ పోషిస్తున్నారు. ఇలాంటి థీమ్ తో హాలీవుడ్ లో పలు సినిమాలు వచ్చాయనీ, వాటి తరహాలోనే ఇదో వైవిధ్యమైన సినిమా అవుతుందనీ, జూలై 17న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|