సెట్స్ లో గోపీచంద్ బర్త్ డే
'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం', 'శైర్యం' వంటి హిట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న గోపీచంద్ తన తాజా చిత్రం 'శంఖం' సెట్స్ లో యూనిట్ సభ్యుల మధ్య తన బర్త్ డే వేడుకను జరుపుకొన్నారు. శ్రీ బాలాజీ సినీ మిడియా పతాకంపై శివ దర్శకత్వంలో జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ సందర్భంగా గోపీచంద్ బర్త్ డే కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకొన్నారు. శివ, భగవాన్,పుల్లారావు, నటులు కోట శ్రీనివాసరావు, సుప్రీత్ తదితరులు గోపీచంద్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. యూనిట్ సభ్యుల మధ్య తన బర్త్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని గోపీచంద్ పేర్కొన్నారు.
అంతకుమందు తన బర్త్ డేని పురస్కరించుకుని గోపీచంద్ ఘట్ కేసరి పోగారంలోని స్వచ్ఛంద సంస్థ 'అంకురం విమెన్ అండ్ చైల్డ్ డవలప్ మెంట్ సొసైటీ' కి వెళ్లి పిల్లల మధ్య బర్త్ డే కేక్ కట్ చేశారు. ఆ సంస్థకు 1,50,000 రూపాయల విరాళాన్ని అందించారు. అదేవిధంగా చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని జూనియర్ ఆర్టిస్టుల పిల్లల చదువు కోసం జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు రూ.25.000 విరాళాన్ని అందించారు.
Be first to comment on this News / Article!
|