విజయవంతమైన 'ప్రయాణం'
మంచు మనోజ్ కుమార్, హారిక జంటగా చంద్రశేఖర్ ఏలేటి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'ప్రయాణం' చిత్రం విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ చూరగొంటోందని చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. హైద్రాబాద్ లో శనివారంనాడు జరిగిన సక్సెస్ మీట్ లో చంద్రశేఖర్ ఏలేటి, బ్రహ్మానందం, హారిక పాల్గొన్నారు.
తొలుత బ్రహ్మానందం మాట్లాడుతూ, 'ప్రయాణం' చిత్రం విజయవంతంగా ప్రదర్శింతమవుతుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇందులో రైతుగా వెరైటీ పాత్రను తాను పోషించాననీ, చాలా మంది తనకు ఫోన్ చేసి తన నటనను అభినందిస్తున్నారనీ చెప్పారు. ఈ తరహా చిత్రాలు తీయడం చాలా రిస్క్ తో కూడిన పని అనీ, ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా పేరున్న చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రాన్ని విజయపథంలోకి నడిపించారనీ అన్నారు. మనోజ్ నటనతో పాటు సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయన్నారు. సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమిదని పేర్కొన్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో బ్రహ్మానందం తనను ఎంతో ప్రోత్సహించారనీ, ఇంతవరకూ తాను తీసిన మూడు చిత్రాల కంటే ఈ చిత్రం మరింత వైవిధ్యమైన సినిమా అని అన్నారు. మూడో వారంలో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తోందని చెప్పారు. ఈ సక్సెస్ కు కారణమైన యూనిట్ కూ, ప్రేక్షకులకూ తన కృతజ్ఞతలని అన్నారు. చంద్రశేఖర్ ఏలేటి చిత్రంలో నటించే అవకాశం రావడం, సినిమా సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉందని హారిక పేర్కొంది.
Be first to comment on this News / Article!
|