కొత్తవారితో సూపర్ గుడ్ చిత్రం
పలు విజయవంతమైన చిత్రాలను అందించిన మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా కొత్తవారితో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లోని ఆ సంస్థ కార్యాలయంలో జరిగాయి. చిత్రసీమకు సంబంధించిన పలువురు ప్రముఖులు విచ్చేసి యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. జూలైలో షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేస్తామని ఈసందర్భంగా చిత్ర సమర్పకుడు ఆర్.బి.చౌదరి వెల్లడించారు. ఆబాలగోపాలం మెచ్చేలా ఈ కథలో కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఈనాటి యువతరానికి కావాల్సిన అంశాలతో, రచయిత సుశీ ఓ మంచి కథను చెప్పారని అన్నారు. నిర్మాత ఎన్.వి.ప్రసాద్, పరాజ్ జైన్ లు మాట్లాడుతూ గోరింటాకు వంటి విజయవంతమైన చిత్రం తర్వాత తమ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిదని తెలిపారు. ఆది, శరణ్యామోహన్ జంటగా ఎంపికైన ఈ చిత్రంలో పశుపతి ఓ కీలకమైన పాత్రను పోషించనున్నారు. మిగతా తారాగణం ఎంపిక జరుగుతోంది. కథ సుశీ, మాటలు అల్లు దిలీప్ కుమార్, పాటలు వనమాలి, అశోక్ తేజ, సంగీతం, సెల్వగణేష్, ఛాయగ్రహణం చిట్టిబాబు, నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వతం తాతినేని సత్య వహిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|