కోటి.. నా రేటు అరకోటి
శాంకరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.యస్.నాయుడు దర్శకత్వంలో యన్ లక్ష్మణరావు, వై.వి.శ్రీనివాసరావులు సంయుక్తంగా నిర్మిస్తున్న పాండవులు' (వీళ్ళు రన్నింగ్ బాగా చేస్తారు) చిత్రం రెండవ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. యతిరాజు, రాఘవ, తడివేలు, భాను, భగవాన్, అభినయశ్రీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర దర్శకులు నాయుడు మాట్లాడుతూ మా సినిమాలో విలన్ పాత్ర చాలా వెరైటీగా ఉంటుంది. `నా పేరు కోటి... నేను ఉండేది కింగ్ కోటి... నా రేటు అరకోటి... తేడా వస్తే చినిగిపోద్ది చీటి' అతని డైలాగ్. ప్రతి పాత్రనూ చాలా కేర్ గా చేస్తూ ఇప్పటి వరకు 80శాతం షూటింగ్ పూర్తిచేశామన్నారు. జూలై 1 నుంచి 15 రోజులు నాగార్జునసాగర్, మాచర్ల, పిడుగురాళ్ళ, రేపల్లె, నిజాంపట్నంలో షూటింగ్ చేసి, పాటలను హైదరాబాద్ లో చిత్రీకరించి ఆగస్టులో ఆడియో, సెప్టెంబర్ లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
Be first to comment on this News / Article!
|