`ఐఫా'లో రాజేంద్రప్రసాద్
ప్రపంచవ్యాప్తంగా హిందీ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న `అంతర్జాతీయ భారత చలన చిత్ర మండలి' అవార్డుల వేడుక ఇటీవలే హాంకాంగ్ లోని మెకావ్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మన తెలుగు నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు అరుదైన సత్కారం లభించింది. గ్లోబల్ వార్మింగ్ విషయంలో ప్రజలను చైతన్య పరిచే ఉద్దేశంతో ఇక్కడ తొలిసారిగా గ్రీన్ కార్పెట్ ను పరిచారు. దీనిపై అతిథిగా ఎవరిని ఆహ్వానించాలని అనుకున్నప్పుడు వారి దృష్టిలో మెదిలిన వ్యక్తి రాజేంద్రప్రసాద్. ఎందుకంటే ఆయన ఇంగ్లీషులో `క్విక్ గన్ మురగన్' పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. శాఖాహారాన్ని సమర్థించే పాత్ర మురుగన్. శాఖాహారానికి సింబాలిక్ గా ఉంటుందనే ఉద్దేశంతో గ్రీన్ కార్పెట్ ఎంట్రీకి `క్విక్ గన్ మురుగన్' గెటప్ లో రాజేంద్రప్రసాద్ ను ఆహ్వానించారు. మురుగన్ గా నటకిరీటి ఈ వేడుకల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఐఫా అంబాసిడర్ అయిన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ తదితరులు ప్రత్యేకంగా రాజేంద్రప్రసాద్ తో ముచ్చటించారు. ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి అక్కడివారికి రాజేంద్రప్రసాద్ దక్షిణాదిలో గొప్ప నటుడు అని పరిచయం చేశారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ `ఈ ఆహ్వానానికి చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఎందరో అతిరథమహారథులు పాల్గొన్న ఈ వేడుకల్లో తనను గ్రీన్ కార్పెట్ ఎంట్రీకి ఆహ్వానించడం ఒక తెలుగువాడిగా గర్వపడుతున్నానని అన్నారు'.
Be first to comment on this News / Article!
|