పవన్ `పులి' 1 నుంచి
పవన్ కళ్యాణ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, నిఖిషా పటేల్ హీరోయిన్ గా ఎస్ జె.సూర్యకాంబినేషన్ లో శింగనమల రమేష్ బాబు నిర్మిస్తోన్న `కొమరం పులి' జులై 1 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందనీ, పవన్ కెరీర్ లో ఇది సెన్సేషనల్ చిత్రమవుతుందని నిర్మాత తెలిపారు. తక్కువ చిత్రాలతో ఎక్కువ పాపులారిటీని సంపాందించుకున్న పవన్ కి ఈ చిత్రం మరో సెన్సేషనల్ చిత్రంగా ఈ సినిమా క్రియేట్ చేస్తుందని అన్నారు. గతంలో పవన్ నటించిన ఖుషి వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎస్.జెసూర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోదని చెప్పారు. జూలై నెలాఖరు వరకూ జరిగే తాజా షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ, మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయనీ యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. ఆగస్టులో సినిమా రిలీజ్ కు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మనోజ్ బాజ్ పాయ్, చరణ్ రాజ్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, ఆలీ, కోవై సరళ, విఎంసి హనీఫా, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|