ముమైత్ ఖాన్ తాజా చిత్రం
ముమైత్ ఖాన్, అక్షయ్ లు జంటగా బయోస్కోప్ అండ్ శ్రీమాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై యతిరాజు సంపత్ కుమార్ దర్శకత్వంలో కనుపర్తి శ్రీనివాసప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం విశేషాలను ఆయన వెల్లడించారు. నిర్మాత మాట్లుడూ చక్కటి కథాంశంతో నిర్మితమవుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను రామెజీ ఫిలింసిటీలో జరిగిందన్నారు. ప్రస్తుతం విశ్వేశ్వరయ్య గెస్ట్ హౌస్ లో షెడ్యూల్ పూర్తయిన తదుపరి బ్యాంకాక్ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ముమైత్ ఖాన్ మాట్లాడుతూ కమర్షియల్ అంశాలతో రూపొందున్న ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. హీరో అక్షయ్ మాట్లాడుతూ చక్కటి పాత్ర లభించింనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోనాటి, ఇసాన్, భరత్, పృథ్వీ తదితర తారాగణం. కెమెరా బిబి ప్రసాద్, ఎడిటింగ్ గౌతంరాజు, ఆర్ట్ మధురెబ్బ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం యతిరాజు సంపత్ కుమార్.
Be first to comment on this News / Article!
|