రాజస్థాన్ లో మహేష్
మహేష్, అనుష్క జంటగా కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ బాబు రూపొందిస్తున్న ఓ చిత్రం రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందిన అతడు చిత్రం తరహాలో ఈ చిత్రం ఓ సంచలనం సృష్టిస్తుందని ఆయన అన్నారు. ఈనెల 23 నుంచి రాజస్థాన్ లో ఓ భారీ షెడ్యూల్ ను జరపనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జి.బుల్లిసుబ్బారావు తెలిపారు. ఆగస్టు 6 వరకు ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. సునీల్, బ్రహ్మానందం, నాజర్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, షఫీ, శ్రీరంజని, మధురి ఇతిక, ప్రభు తదితరులు నటిస్తున్నారు. సంగీతం మణిశర్మ, ఛాయాగ్రహణం సునీల్ పటేల్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ఫైట్స్ పీటర్ హెయిన్స్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం త్రివిక్రమ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|