'నీలవేణి'గా ఆర్తి అగర్వాల్
'నువ్వు నాకు నచ్చావు', 'నువ్వులేక నేనులేను', 'ఇంద్ర', 'గోరింటాకు' వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాల కథానాయిక ఆర్తి అగర్వాల్ పెళ్లి అనంతరం మరో ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టింది. తాజాగా రెండు చిత్రాలకు అంగీకరించిన ఆర్తి మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీనియర్ డైరెక్టర్ భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఎం.జి.ఆర్. కంబైన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ 'నీలవేణి' పేరుతో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించనుంది. ఇందులో ఆర్తి ప్రధాన పాత్ర పోషించనుంది. ఈనెల 27 నుంచి ఈ చిత్రం ప్రారంభమవుతుందని సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఆర్తి అగర్వాల్ సరసన బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ నటించనున్నారని ఆయన తెలిపారు. ముకుల్ దేవ్ ప్రస్తుతం వి.వి.వినాయక్ చిత్రంలోనూ, ప్రభాస్ 'ఏక్ నిరంజన్'లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు చెప్పారు. ఆర్తీ అగర్వాల్ కు తగినట్టుగా ఈ చిత్రంలో చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ , భరత్ పారేపల్లి స్టయిల్ లో మాస్ అంశాలు కలిసిన వైవిధ్యభరితమైన చిత్రంగా 'నీలవేణి' ఉంటుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రవికాలే, ఉత్తేజ్, సుప్రీత్, శివపార్వతి, హేమ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి కొమ్మనాపల్లి మాటలు, ఎ.ఆర్.బాబు సినిమాటోగ్రఫీ, లలిత్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|