'రాజు-మహారాజు' క్లీన్ యు
మోహన్ బాబు, రమ్యకృష్ణ, శర్వానంద్, సుర్విన్ చావ్లా, తషుకౌశిక్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'రాజు-మహారాజు'. భానుశంకర్ దర్శకత్వంలో శ్రీ కుమార స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ లభించిందనీ, ఈనెల 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముదుకు తీసుకు వస్తున్నామనీ నిర్మాత కుమార స్వామి తెలిపారు.
మంచి కుటుంబ కథా చిత్రానికి వినోదం మేళవించి ఈ చిత్రం రూపొందిందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన అన్నారు. కుటుంబ కథే అయినా కమర్షియల్ హంగులన్నీ ఇందులో ఉంటాయన్నారు. చక్రి సంగీతం అందించిన ఆడియోకి మంచి స్పందన లభించిందనీ, దీంతో సినిమాపై మరింత అంచనాలు ఎక్కువవయ్యాయనీ చెప్పారు. మోహన్ బాబు తమ్ముడిగా శర్వానంద్, మోహన్ బాబు జంటగా రమ్యకృష్ణ నటించారని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, చంద్రమోహన్, ధర్మవరపు, ఎల్.బి.శ్రీరాం, రఘుబాబు, కోట శ్రీనివాసరావు, నాజర్, విజయకుమార్, ఎం.ఎస్.నారాయణ, సుధ, సురేఖావాణి తదితరులు నటించారు. జీవన సత్యం మాటలు, రమష్ సినిమాటోగ్రఫీ, కోటగిరి ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|