శిల్పకళా వేదికపై 'మగధీర'
'చిరుత' చిత్రం తర్వాత రామ్ చరణ్ తేజ నటించిన 'మగధీర' చిత్రం పబ్లిసిటీకి దూరంగా నిర్మాణం పూర్తి చేసుకుని ఆడియో ఫంక్షన్ నుంచి
ఉధృతమైన ప్రచారంతో దూసుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఫెయిల్యూర్స్ ఎరుగని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్కంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, హిందీ 'గజనీ'తో కలెక్షన్లపరంగా ఆలిండియా రికార్డులను తిరగరాసిన అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సుమారు 35 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈడియోను ఈనెల 28వ తేదీ సాయంత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగుని రీతిలో గ్రాండ్ ఫంక్షన్ గా ఆడియో రిలీజ్ ఉండబోతోంది. శిల్పకళా వేదిక వద్ద నిర్వహించనున్న ఈ వేడుకలో మెగాస్టార్ ఫ్యామిలీ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొంటారు.
'మగధీర' చిత్రాన్ని ప్రేమకథా ఇతివృత్తంగా పూర్వజన్మల కథాంశంతో రాజమౌళి తెరకెక్కించారు. 400 ఏళ్ల క్రితం తమ ప్రేమను సాఫల్యం చేసుకోలేక పోయిన యువజంట మళ్లీ జన్మ ఎత్తి తమ ప్రేమను ఏవిధంగా పండించుకున్నారనేది ఇందులోని కథాంశం. రామ్ చరణ్ కు జోడిగా కాజల్ నటించగా, శ్రీహరి మరో కీలక పాత్రలో నటించారు. సుమారు 220 పనిదినాలతో గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కింది. 'ఘరానా మెగుడు' చిత్రంలోని 'బంగారు కోడిపెట్ట' అనే హిట్ సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేయడం, రామ్ చరణ్ తో చిరంజీవి కలిసి స్టెప్ట్స్ వేయడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఆరు పాటలు వేటికవే ప్రత్యేకత కలిగి ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్ర్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. జూలై రెండో వారంలో 'మగధీర' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Be first to comment on this News / Article!
|