నటి శ్రీదేవి వివాహం
'రుక్మిణి' చిత్రంలో బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రభాస్ సరసన 'ఈశ్వర్' చిత్రంలో కథానాయికగా మారిన శ్రీదేవి వివాహం ఈనెల 18వ తేదీ గురువారంనాడు చెన్నైలో జరుగనుంది. మంజుల, విజయ్ కుమార్ దంపతుల కనిష్ట పుత్రిక అయిన శ్రీదేవి వివాహం నిజామాబాద్ కు చెందిన తెలుగువాడైన రాహుల్ తో జరుగనుంది. పూనమల్లై హైరోడ్ లోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ లో ఉదయం 7-31 నుండి 9-00 గంటల మధ్యన వివాహ ముహూర్తం నిశ్చయించారు. తమిళ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. మంజుల వివాహానికి అందరూ హాజరుకావాలంటూ మంజుల-విజయ్ కుమార్ దంపతులు మీడియాకు ఆహ్వాన పత్రికలు పంపారు. విహాహానంతరం ఈ నెల 21వ తేదీ సాయంత్రం హైద్రాబాద్ హైటెక్స్ లోని నోవోటెల్ లో రెసెప్షన్ ఏర్పాటు చేశారు.
నటిగా పలు తమిళ, తెలుగు చిత్రాల్లో శ్రీదేవి నటించారు. ప్రభాస్, తరుణ్, శ్రీకాంత్ వంటి పలువురు హీరోలతో నటించిన శ్రీదేవికి సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. అయితే ఎప్పటికప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తూ ఆ భాషపై తనకున్న మమకారాన్ని ఆమె చాటుకునేది. వివాహానరంతరం శ్రీదేవి నటనను కొనసాగిస్తుందా అనేది ఇంకా తెలియవలసి ఉంది.
Be first to comment on this News / Article!
|