సక్సెస్ సంబరంలో 'రైడ్'
కొద్ది గ్యాప్ తర్వాత తన బ్యానర్ లో వచ్చన స్ట్రయిట్ తెలుగు చిత్రం 'రైడ్' విజయవంతంగా ప్రదర్శితమవుతుండటం చాలా సంతోషంగా ఉందని నిర్మాత బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. ఈ చిత్ర దర్శకుడు రమేష్ వర్మతోనే మరో చిత్రాన్ని కూడా ప్లాన్ చేసినట్టు చెప్పారు. తనీష్, నాని, శ్వేతాబసుప్రసాద్, అక్ష ప్రధాన పాత్రల్లో రూపొందిన 'రైడ్' చిత్రం సక్సెస్ మీట్ ను సంస్థ కార్యాలయంలో బెల్లంకొండ సురేష్ బుధవారంనాడు ఏర్పాటు చేశారు. రమేష్ వర్మ, తనీష్, నాని, శ్వేతాబసు ప్రసాద్, నటుడు కాశీ విశ్వనాథ్, రచయిత శశాంక్ వెన్నెలకంటి తదితరులు పాల్గొన్నారు.
'రైడ్' చిత్రం అందరికీ మరచిపోలేని అనుభూతిని మిగిల్చిందనీ, ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ మరో మెట్టు పైకెదిగారని నాని అన్నారు. 'నచ్చావులే' తర్వాత సోలో హీరోగా నటించమని అంతా అన్నప్పటికీ బెల్లంకొండ సురేష్ పెద్ద నిర్మాత కావడంతో సినిమా అంగీకరించాననీ, ఇంత మంచి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందనీ తనీష్ పేర్కొన్నారు. తన తొలిచిత్రం 'కొత్త బంగారులోకం' విజయవంతం కావడంతో రెండో సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయనీ, అందరి అంచనాలను నిజం చేస్తూ రైడ్ మంచి సక్సెస్ సాధించడం సంతోషం కలిగించిందని శ్వేతబసు ప్రసాద్ పేర్కొంది. తనతో పాటు నాని, తనీష్, అక్ష, దర్శకుడు రమేష్ వర్మకు కూడా ఇది రెండో చిత్రమని అన్నారు. ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ పట్ల కాశీ విశ్వనాధ్, శశాంక్ వెన్నెలకంటి సంతోషం వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|