'భీష్మ' పూజా కార్యక్రమం
బాలకృష్ణ కథానాయకుడుగా రమేష్ వర్మ ('రైడ్' ఫేమ్) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న కొత్త చిత్రం 'భీష్మ'. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, 'చెన్నకేశవరెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాల తర్వాత బాలకృష్ణతో తమ బ్యానర్ లో మూడో చిత్రమిదనీ, బాలయ్య బాబుతో మళ్లీ కలిసి పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ చెప్పారు. బాలకృష్ణతో సినిమా చేసేందుకు కృష్ణవంశీ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారనీ, అయితే తాము అడగ్గానే ఆయన ఈ టైటిల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలనీ అన్నారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారనీ, అయితే ఇంకా ఎవరినీ ఫైనలైజ్ చేయలేదనీ చెప్పారు. ఈ నెల 29న గ్రాండ్ గా ఈ చిత్ర ప్రారంభోత్సవం ఉంటుందనీ, అదే రోజు హీరోయిన్ల పేర్లు, సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తామనీ చెప్పారు. దర్శకుడు రమేష్ వర్మ చెప్పిన కథ తనకెంతో నచ్చిందని అన్నారు. నిజానికి 'రైడ్' స్క్రిప్టు కంటే ముందే ఈ చిత్రం స్క్రిప్టు తనకు చెప్పారనీ, అయితే 'రైడ్' చిత్రాన్నే ముందు ప్రారంభించామనీ చెప్పారు.నటరత్న ఎన్టీఆర్ క్లాసిక్ 'భీష్మ'కూ దీనికీ పోలిక ఉండదనీ, ఇదెంతమాత్రం పౌరాణికం కాదనీ, పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ అనీ వివరణ ఇచ్చారు.
Be first to comment on this News / Article!
|