శ్రీదేవి మెడలో మూడుముళ్లు
మంజుల-విజయ్ కుమార్ దంపతుల కనిష్ట పుత్రిక, నటి శ్రీదేవి వివాహం హైద్రాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాహుల్ తో గురువారం ఉదయం 7.30 గంటలకు చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. పూనమల్లై హైరోడ్ లోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకకు పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సత్యరాజ్, శరత్ కుమార్, జయం రవి, సుందర్ సి, స్నేహ, మీనా, త్రిష, మహేశ్వరి, రంభ, సంఘవి, ఖుష్బూ, సీనియర్ నటి శ్రీదేవి, దర్శకుడు బాల, శివకుమార్ తదితర ప్రముఖులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీదేవి సోదరుడు అరుణ్ కుమార్, సోదరీమణులు ప్రీతి, వనిత, బావ హరి తదితరులు అతిథులకు స్వాగతం పలుకుతూ సందడి చేశారు. అనంతరం 9 గంటల నుంచి రెసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 21న శ్రీదేవి-రాహుల్ దంపతులు హైద్రాబాద్ హైటెక్స్ లోని నోవోటెల్ లో కూడా రెసెప్షన్ ఇవ్వనున్నారు.
Be first to comment on this News / Article!
|