దుబాయ్ లో 'మా' షో
మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా) నిధుల సమీకరణ కోసం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా తాము రెండు కార్యక్రమాలను చేపట్టనున్నట్టు 'మా' అధ్యక్షుడు ఎం.మురళీమోహన్ తెలియచేశారు. హైద్రాబాద్ లో గురువారంనాడు ఆయన ఆ వివరాలను తెలియజేశారు. పలువురు అసోసియేషన్ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు గతంలో సమకూర్చుకున్న నిధులు తగ్గిపోవడంతో పేద కళాకారులకు నెలనెలా ఇచ్చే పింఛను కూడా ఇవ్వలేని పరిస్థితిలు ఉన్నాయని, ఇందుకోసం అవసరమైన నిధుల సేకరణ ఆవశ్యకమైందనీ మురళీ మోహన్ తెలిపారు. ఇందుకోసం దుబాయ్ లో తమ అసోసియేషన్ ఓ కల్చరల్ షో ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు. అలాగే యువ హీరోలను నాలుగు జట్లుగా
ఎంపిక చేసి మన రాష్ట్రంలో టీ-20 క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించాలని కూడా నిర్ణయించినట్టు చెప్పారు. తమ మూవీ స్టార్స్ డాట్ కామ్ ను ప్రారంభించి ఈరోజుతో 100 రోజులు పూర్తయిందని తెలిపారు. దేశవిదేశాల్లో ఈ వెబ్ సైట్ కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రోజుకు 27 వేల మంది తిలకిస్తున్నారనీ, మునుముందు ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించేందుకు సిబ్బందిని పెంచుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆహుతి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి జయసుధ, వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి, ఏవీయస్, శివకృష్ణ, ఆలీ, శివాజీరాజా, బెంగుళూరు పద్మ, కాదంబరి కిరణ్ కుమార్, గౌతంరాజు, మాణిక్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|