అల్లు అర్జున్-గుణశేఖర్ చిత్రం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై రూపొందున్న భారీ చిత్రం నాలుగో షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి ఈ షెడ్యూల్ జరుగుతున్నట్టు చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు.
అల్లు అర్జున్, గుణశేఖర్ తొలి కాంబినేషన్ లో అద్భుతమైన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఏకథాటిగా జరిగే తాజా షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. 'దేశముదురు' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తో తాము రూపొందిస్తున్న ఈ చిత్రం తమ బ్యానర్ కు మరింత ప్రతిష్ఠాత్మకం కానుందన్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, గుణశేఖర్ ఎక్స్ లెంట్ టేకింగ్ తో భారీ స్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోందని చెప్పారు. అల్లు అర్జున్ సరసన ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గుణశేఖర్ కథ, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ఆంధోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|