శ్రీదేవి పెళ్లి రెసెప్షన్
నూతన దంపతులైని శ్రీదేవి-రాహుల్ వివాహ రెసెప్షన్ హైటెక్స్ లోని నోవోటెల్ లో ఆదివారం రాత్రి సందడిగా జరిగింది. మంజుల-విజయ్ కుమార్ దంపుతల కనిష్ట కుమార్తె అయిన నటి శ్రీదేవి వివాహం ఈనెల 18న చెన్నైలోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ లో జరిగింది. తమిళ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వివాహ వేడుకలో పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారి కోసం శ్రీదేవి దంపతులు హైద్రాబాద్ లో రెసెప్షన్ ఇచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, 'ప్రజారాజ్యం' పార్టీ అధినేత చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, డాక్టర్ ఎం.మోహన్ బాబు, సిద్దార్ధ, మంచు విష్ణువర్దన్ దంపతులు, లక్ష్మీప్రసన్న, జయసుధ, నితిన్ కపూర్, కె.రాఘువేంద్రరావు, డి.రామానాయుడు, అల్లు అరవింద్, జగపతి రాజేంద్ర ప్రసాద్, కృష్ణంరాజు దంపతులు, కృష్ణవంశీ-రమ్యకృష్ణ, సిద్దార్ధ, వడ్డే నవీన్, శ్రీకాంత్, రానా, స్మిత, రమేష్ ప్రసాద్, ఎం.ఎస్.రాజు, బాబూమోహన్, నెపోలియన్, రవిరాజా పినిశెట్టి, కోనవెంకట్ తదితర ప్రముఖులు ఈ రెసెప్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, మోహన్ బాబు కలిసి కరచాలనం చేయడం, కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించుకోవడం అందర్నీ ఆకట్టుకుంది.
Be first to comment on this News / Article!
|