ప్రజాసేవలో శ్రీహరి
హీరో అంటే సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే నిజ జీవితంలో కూడా పేదలకు సేవ చేసి, సంఘ సేవా కార్యక్రమాలతో రియర్ హీరో అనిపించుకుంటున్నాడు రియల్ స్టార్ శ్రీహరి. తన కుమార్తె అక్షర పేరుతో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. లక్ష్మీపూర్, అనంతారం, నారాయణ పూర్ గ్రామాల్లో ఫ్లోరైడ్ బాధితుల కోసం రెండు మినరల్ వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేశారు. జూబ్లీబిల్స్ లోని తన నివాసంలో శ్రీహరి, శ్రీమతి శాంతి శ్రీహరి ఆ వివరాలను తెలియజేశారు.
దత్తత గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నందున ఎంతోమంది వికలాంగులుగా మారుతున్నారనీ, వీరి కోసం రెండు వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ మూడు గ్రామాలకు చెందిన 2000 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫారాలు, పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు అందజేస్తున్నామని చెప్పారు. శాంతికి ఇలాంటి సేవా కార్యక్రమాలంటే ఇష్టమనీ, చనిపోయిన తమ కుమార్తె పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు జరుపుతున్నామనీ చెప్పారు. తన సంపాదనలో 40 నుంచి 50 శాతం ఇలాంటి కార్యక్రమాలు ఖర్చుచేస్తానని శ్రీహరి తెలిపారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ, తన భర్త సంపాదనలో కొంతమేరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని నిర్ణయించామనీ, తొలుత ప్రచారం వద్దని అనుకున్నప్పటికీ మరింతమందికి ప్రేరణ అవుతుందనే ఉద్దేశంతోనే తాము ఈ విషయాలు తెలియజేస్తున్నామనీ పేర్కొంది. ప్రతి ఒక్కరూ గ్రామాలను దత్తత తీసుకుండే పేదరిక నిర్మూలనకు దోహదకారి అవుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్న గ్రామాలను దత్తత తీసుకునే ఆలోచనలో కూడా తాము ఉన్నామని తెలిపారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|