నాగ్ చిత్రం జూలై 24 నుంచి
'కింగ్' చిత్రం తర్వాత నాగార్జున కొత్త చిత్రం ఏదీ ఈ ఏడాది విడుదల కాకపోవచ్చనే ఊహాగానాలకు తెరపడినట్టే. 'కింగ్' వంటి శతదినోత్సవ చిత్రాన్ని అందించిన డి.శివప్రసాద్ రెడ్డి మరోసారి నాగార్జున కథానాయకుడుగా కామాక్షి కళా మూవీస్ పతాకంపై కొత్త చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు పక్కాగా ప్లానింగ్ చేస్తున్నారు. నాగార్జునకు సొంత బ్యానర్ లాంటి ఈ సంస్థలో 'అల్లరి అల్లుడు', 'నేనున్నాను' వంటి పలు హిట్ చిత్రాలు వచ్చాయి. 'కింగ్' సక్సెస్ మీట్ లో తన తదుపరి చిత్రాన్ని మళ్లీ శివప్రసాద్ రెడ్డి బ్యానర్ లో చేయబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. ఆ ప్రకారమే కొద్దికాలంగా స్క్రిప్టు, నటీనటుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది.
నాగార్జునతో మరో సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించాలనే ఉద్దేశంలో అద్భుతమైన కథ రెడీ చేసినప్పుటు డి.శివప్రసాద్ రెడ్డి తాజాగా తెలిపారు. ఈ చిత్రం ద్వారా కిరణ్ కుమార్ అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని చెప్పారు. జూలై 24 నుంచి షూటింగ్ ప్రారంభిస్తామనీ, నాగార్జునకు ఉన్న డిసెంబర్ హిట్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది చివర్లోనే సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నామనీ చెప్పారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ చిత్రాంగద సింగ్ ఎంపికైనట్టు తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|