'కలవరమాయే..' పాటలు
దర్శకుడు సతీష్ మాట్లాడుతూ, దిల్ రాజ్ తాను చెప్పిన కథలు నచ్చి తర్వాత చేద్దామని అన్నప్పటికీ ఎక్కువ కాలం ఆగలేనని ఆయనకు చెప్పి ఈ బ్యానర్ లో సినిమా చేశానని చెప్పారు. దిల్ రాజు ఈ సినిమాను ముట్టుకోవడం, నామకరణం చేయడం వల్ల సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు. స్వాతి నటన సావిత్రిలా ఉందని చాలా మంది అన్నారనీ, అలాగే కమల్ కామరాజులో మంచి నటుడు ఉన్నాడనీ అన్నారు. సినిమా బాగా రావడానికి నిర్మాత మంచి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు.
కమల్ కామరాజు మాట్లాడుతూ, ఈ స్క్రిప్టు విన్నప్పుడు తనకు కన్నీళ్లు ఆగలేదనీ, ఇందులో తనకు ఓ చిన్న క్యారెక్టర్ తనకు ఇస్తారని అనుకున్నాననీ, అయితే హీరో ఛాన్స్ ఇచ్చారనీ చెప్పారు. మనసు కదిలించే కథాంశంలో సినిమా ఉంటుందనీ, స్వాతి క్యారెక్టర్ డైనమేట్ లా తెరపై పేలుతుందన్నారు. ఈ సినిమాలో స్టార్ ఎవరూ లేరనీ, అంతా కష్టపడి పనచేశామనీ స్వాతి పేర్కొంది. సినిమా చాలా బాగా వచ్చిందని, మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నామనీ చెప్పింది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|