రామానాయుడు గుజరాతీ చిత్రం
సురేష్ ప్రొడక్షన్స్ అధినేతగా శతాధిక చిత్రాలను నిర్మించిన డాక్టర్ డి.రామానాయుడు భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలు తీయాలనే ఆశయాన్ని త్వరలో పూర్తి చేయబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ తదితర భాషల్లో చిత్రాలు నిర్మించిన రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స బ్యానర్ పై ఈనెల 18న ముంబైలో ఓ గుజరాతీ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. తెలుగులో విజయవంతమైన 'నాయుడిగారి కుటుంబం' సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుజరాతీలో దర్శకుడిగా మంచి గుర్తింపు ఉన్న అవిరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలు తీయాలనే తన ఆశయంలో భాగంగా గుజరాతీ చిత్రానికి శ్రీకారం చుట్టినట్టు రామానాయుడు తెలిపారు. త్వరలోనే భోజ్ పురి పంజాబీ చిత్రాలను కూడా నిర్మిస్తానని తెలిపారు. దీంతో 14 భాషల్లోనూ సినిమాలు నిర్మించిన క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. కనీసం ఒక చిత్రానికైనా దర్శకత్వం వహించాలనే కోరిక కూడా రామానాయుడుకు ఉంది. ప్రస్తుతం ఆయన తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లరి నరేష్ కథానాయకుడుగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 'బెండు అప్పారావు' ఆర్.ఎం.పి. అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|