జూలై 31న 'ఫిల్మ్ ఫేర్'
ప్రదీప్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, దక్షిణాదిలో ఐడియో చాలా శక్తివంతమైన టెలికామ్ ఆపరేటర్ అనీ, దక్షిణాది ప్రిస్టేజియస్ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో తమ భాగస్వామ్యం ద్వారా దక్షిణాది సబ్ స్కైబర్లతో తమకు మరింత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయని అన్నారు. సినిమా అంటే అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడతారనీ, ఈసారి హైద్రాబాద్ లో ఐడియా అసోసియేషన్ తో ఫిల్మ్ ఫేర్ అవార్డులు నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందనీ అన్నారు. ఇలియానా వంటి ప్రతిభావంతులను ప్రోత్సహించిన క్రెడిట్ తెలుగు ప్రేక్షకులకు దక్కుతుందన్నారు. ఐడియా సబ్ స్కైబర్స్ మొత్తంలో కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల వాటా 25 శాతానికి పైగా ఉందన్నారు. తమిళనాడులో ఇటీవలే ఐడియా సర్వీస్ లు ప్రారంభించామనీ, చెన్నైలో మెట్రోలో తమ సేవలు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఐడియా సబ్ స్కైబర్ల కోసం కొన్ని కాంటెస్ట్ లు నిర్వహించి లక్కీ సబ్ స్కైబర్లకు జూలై 31న జరిగే ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల సెర్మనీలో పాల్గొనే అవకాశం కల్పిస్తామనీ, ఫిల్మ్ ఫేర్ తో బ్రాండ్ అసోసియేషన్ లో భాగంగా తమ ఫేవరెట్ స్టార్స్ ను కలుసుకునే అవకాసాన్ని కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సబ్ స్కైబర్లకు కల్పిస్తామని చెప్పారు.
మేలుచేసిన 'ఫిల్మ్ ఫేర్'...
రెండేళ్ల క్రితం ఉత్తమ తొలిచిత్ర నటిగా ('దేవదాసు' చిత్రం) ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇవ్వడం తన కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపకరించిందని ఇలియానా సంతోషం వ్యక్తం చేసింది. హైద్రాబాద్ లో ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డులు-2008 నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందని పేర్కొంది. నటిగా తన కెరీర్ ఇప్పడు ఎంతో బాగుందనీ, ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తన కృతజ్ఞతలనీ అన్నారు. 2008 ఐడియా ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డు ఎవరిని వరిస్తుందని అనుకుంటున్నారనే ఓ ప్రశ్నకు...ఈ ఏడాది అయితే తాను చెప్పగలననీ, గత ఏడాది చిత్రాలకు కాబట్టి తనకు పెద్దగా అవగాహన లేదనీ ఇలియానా సమాధానమిచ్చింది. ప్రస్తుతం తాను నితిన్ సరసన ఇంకా పేరుపెట్టని ఓ చిత్రంలోనూ, విష్ణువర్దన్ బాబుతో 'సలీం' చిత్రంలోనూ నటిస్తున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపింది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|