'గాలి శీను' వస్తున్నాడు
డాన్ కావాలని కలగనే ఓ వీధిరౌడీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనే ఇతివృత్తంతో హాస్యప్రధానంగా రూపొందుతున్న చిత్రం 'గాలి శీను'. పోసాని కృష్ణమురళి ప్రత్యేక పాత్రలో ఆర్.కె., సత్యకృష్ణన్ ప్రధాన పాత్రధారులుగా స్వప్న మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. పి.ఉదయ్ భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. హైద్రాబాద్ లో సోమవారంనాడు ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
గుండాయిజం చేసే ఓ దాదా సినిమాల్లో నటించాలనుకుంటాడనీ, ఆ నేపథ్యంలో అతనికెదురైన కష్టాలు ఇందులో వినోదభరితంగా చూపించామని దర్శకుడు ఉదయ్ భాస్కర్ తెలిపారు. మామ పాత్ర ద్వారా సుపరిచితుడైన ఆర్.కె. ఇందులో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా, పోసాని ఎమ్మెల్యేగా నటించారనీ, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ చక్కటి కమర్షియల్ అంశాలు కలిగిన చిత్రమిదని అన్నారు. ఇందులో ముమైత్ ఖాన్ పాట మరో హైలైట్ గా నిలుస్తుందన్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో వచ్చేవారంలోనూ, జూలై మొదటివారంలో సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాతల్లో ఒకరైన కళారవీంద్ర ఫణిరాజ్ తెలిపారు. ఆర్.కె.మూవీస్ ద్వారా ఆంధ్రదేశమంతటా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ఆర్.కె.గౌడ్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కావ్య, చిత్రం భాష, మోనిక, సాజిత్, మాస్టర్ శివవర్మ తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|