వెలుగు చూస్తున్న 'రాత్రి'
హారర్ అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా 'రాత్రి' చిత్రం తెరకెక్కింది. చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలికాపీతో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ఆదుకోవడంతో ఈ చిత్రం విడుదలకు మార్గం సుగగమైంది. హైద్రాబాద్ లో ఆ విశేషాలను చిత్రయూనిట్ సోమవారం తెలియజేసింది.
చిమ్మ చీకటిలో నమ్మకం అపనమ్మకమై, ప్రేమ పునాదులు కదిలిపోతే సంభవించే పరిణామాల నేపథ్యమే ఈ చిత్ర కథ అని భానుకిరణ్ తెలిపారు. షియాజీ షిండే, ప్రీతిమెహ్రా, జీవా, సమీర్, శ్రీనివాసరెడ్డి, వహీదా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని చెప్పారు. ముఖ్యంగా షిండే నటన, స్క్రీన్ ప్లే ప్రత్యేక హైలైట్స్ గా ఉంటాయని అన్నారు. ఎంతో కష్టపడి సినిమా చేసినప్పటికీ విడుదల ఎలా చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమతి తమను ఆదుకుందనీ, ఆ సంస్థ ద్వారా తమ చిత్రం విడుదలవుతుందనీ చెప్పారు. ప్రముఖ దర్శక నిర్మాత సాగర్ మాట్లాడుతూ, సినిమా తీయడం ఒక ఎత్తయితే, విడుదల చేయడం మరో ఎత్తుగా మారిందనీ, ఈ నేపథ్యంలో పరిరక్షణ సమితి ఏర్పడి నిర్మాతలను ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఎలాంటి కమిషన్ లేకుండా నిర్మాతలను పరిరక్షణ సమతి ఆదుకుటుందని నట్టికుమార్ తెలిపారు. పది రోజులకు ముందే పబ్లిసిటీ మొదలుపెట్టడం, థియేటర్లు నిర్ణయించడం వంటివన్నీ సమితి చూస్తుందన్నారు. సమితి ద్వారా విడుదల చేస్తున్న రెండో చిత్రమిదని చెప్పారు. జూలై 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అడవుల్లో ఎంతో కష్టపడి సినిమా తీశామనీ, తమ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారనే నమ్మకంతో ఉన్నామనీ నిర్మాత కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ప్రమోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|