నిఖిల్-శ్వేత 'కళావర్ కింగ్'
'హ్యాపీడేస్', 'యువత' వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో నిఖిల్ మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రానికి 'కళావర్ కింగ్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. సాయికృష్ణా ప్రొడక్షన్స్ పతాకంపై ఈమధ్యనే నితిన్ హీరోగా 'ద్రోణ' చిత్రాన్ని నిర్మించిన దమ్ములపాటి శ్రీనివాసరావు ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. సురేష్ అనే కొత్త దర్శకుడిని ఈ చిత్రంతో పరిచయం చేయనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా శ్వేతాబసు ప్రసాద్ నటించనుంది.
'కొత్త బంగారులోకం' వంటి హిట్ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్వేతాబసు ప్రసాద్ ఇటీవల 'రైడ్' చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించింది. దీంతో శ్వేతబసు తెలుగులో బిజీ అవుతోంది. 'కళావర్ కింగ్'ను ప్రేమకథా ఇతివృత్తంతో తెరకెక్కించనున్నామనీ, జూలై రెండో వారంలో ఈ చిత్రాన్ని ప్రారంభిచేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత డి.శ్రీనివాసరావు తెలిపారు.
Be first to comment on this News / Article!
|