సినీ గుట్టుచెప్పే 'గ్లామర్'
సినీరంగంలోకి అడుగుపెట్టాలనుకునే హీరోహీరోయిన్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే అంశంతో రూపొందుతున్న చిత్రం 'గ్లామర్'. కరిష్మా కోఠక్ ('శంకర్ దాదా జిందాబాద్' ఫేమ్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. జనం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శరవేగంగా ఈ చిత్ర నిర్మాణం జరుపుతున్నట్టు షూటింగ్ స్పాట్ లో సత్యారెడ్డి మంగళవారంనాడు తెలిపారు.
హైద్రాబాద్ లోని వివిధ లొకేషన్లతో పాటు ఓ స్టార్ హోటల్ లో ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నామనీ, ఈనెల 25తో తొలి షెడ్యూల్ పూర్తవుతుందనీ ఆయన చెప్పారు. ఇందులో ముగ్గురు ప్రముఖ హీరోయిన్లు, ఒక ప్రముఖ హీరో ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్టు తెలిపారు. టైటిల్ కు తగ్గట్టుగా చాలా గ్లామరస్ గా చిత్రం ఉంటుందన్నారు. జూలై మొదటివారంలో రెండో షెడ్యూల్ నాగార్జున సాగర్, వైజాగ్, కోనసీమ, కోటప్పకొండ, ఎత్తిపోతల ప్రాంచాల్లో జరుపుతామని చిత్ర సమర్పకుడు ఎస్.ఎస్.రెడ్డి తెలిపారు. ఇందులో ఐదు పాటలు ఉన్నట్టు సంగీత దర్శకుడు బోంబే రవి తెలిపారు. బాలీవు్డ్ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి వద్ద 20 ఏళ్లు పనిచేశాననీ, ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించిన సత్యారెడ్డికి తన కృతజ్ఞతలనీ అన్నారు. కథ నచ్చి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు కరిష్మా కోటక్ తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో భవనేశ్వరి, అభినయశ్రీ, తెలంగాణ శకుంతల, కవిత, రామిరెడ్డి, రఘునాథరెడ్డి, బోంబే రవి, కళ్లు చిదంబరం, ఏవీయస్, గుండు హనుమంతరావు తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే సైతం పి.సత్యారెడ్డి అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, పత్తిపాటి శ్రీనివాస్ ఎడిటింగ్, పవర్ భరత్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|