రష్యన్ భామలతో 'క్విక్ గన్'
నవ్వులరేడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ కథనాయకుడుగా ఆంగ్లంలో రూపొందుతున్న చిత్రం 'క్విక్ గన్ మురుగన్'. ఇటీవల జరిగిన ఐఫా వేడుకలో క్విక్ గన్ మురుగన్ గెటప్ లో రాజేంద్రప్రసాద్ పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ఫ్యాట్ ఫిష్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ పాటను ముంబైలోని ఓ సెవన్ స్టార్ హోటల్ లో చిత్రీకరించారు. రాజేంద్ర ప్రసాద్, రష్యన్ భామలపై ఈ పాటను చిత్రీకరించారు. ఉత్తరాది పాపులర్ సింగర్ మిఖాసింగ్ ఈ పాటను పాడారు.
దర్శకుడు శశాంక్ ఘోష్ మాట్లాడుతూ, సినిమాలో ఈ పాట చాలా కొత్త తరహాలో ఉంటుందని చెప్పారు. దక్షిణాదిలో ప్రముఖ నటుడైన డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో ఈ పాట చిత్రీకరిస్తున్నామని తెలియగానే మిఖాసింగ్ ఉత్సాహంగా ఈ షూటింగ్ లో పాల్గొన్నారని తెలిపారు. శాఖాహారాన్ని సమర్థించే హీరోకూ, మాంసాహారాన్ని సమర్థించే విలన్ కూ మధ్య సాగే సమరం ఆసక్తిదాయకంగా ఉంటుందనీ, ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందనీ తెలిపారు. ఫాక్స్ స్టార్ స్టూడియో సంస్థ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని చెప్పారు.
Be first to comment on this News / Article!
|