'రైడ్' ప్లాటినం డిస్క్
తనీష్, నాని, అక్ష, శ్వేతబసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'రైడ్' చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంటోంది. హేమచంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ప్లాటినం డిస్క్ వేడుకను హైద్రాబాద్ లో నిర్వహించారు. చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వి.వి.వినాయక్, శ్రీనువైట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
'రైడ్' చిత్రం పెద్ద హీరో సినిమాలు సక్సెస్ అయితే ఏ స్థాయిలో స్పందన ఉంటుందో ఆ రేంజ్ లో ఉందనీ, విడుదలైన రోజు నుంచి అప్రతిహతంగా విజయపథంలోకి దూసుకుపోతోందనీ వి.వి.వినాయక్ ప్రశంసించారు. రమేష్ వర్మ డిజైన్ల తరహాలోనే సినిమా కూడా చాలా బాగుందనీ, ఎకాఎకిన ఇప్పుడు బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారనీ పేర్కొన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావడం సంతోషంగా ఉందనీ శ్రీనువైట్ల పేర్కొన్నారు. నాని తన వద్ద సహాయకుడిగా గతంలో పని చేశాడనీ, ఇప్పుడు హీరోగా కూడా మంచి సక్సెస్ లు సాధిస్తున్నాడనీ అన్నారు. రమేష్ వర్మ మంచి అభిరుచి గల దర్శకుడని నిరూపించుకున్నారని అన్నారు. సమష్టి కృషితో సాధించిన విజయంగా రైడ్ సక్సెస్ ను బెల్లంకొండ సురేష్, రమేష్ వర్మ అభివర్ణించారు. అనంతరం వినాయక్, శ్రీనువైట్ల చేతుల మీదుగా ప్లాటినం డిస్క్ ల ప్రదానం జరిగింది. నాని, తనీష్, అక్ష, శ్వేతబసు ప్రసాద్, హేమచంద్ర, నటు కాశీ విశ్వనాథ్, ఆదిత్య దయానంద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|