'జగద్గురు బాబా'కు క్లీన్ యు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా, యోగిరాజుగా తనను నమ్మిన వారిని తరింపజేస్తున్న శ్రీ షిర్డీ సాయిబాబాపై గతంలో పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరింత వైవిధ్యంగా ఇప్పుడు షిర్డీ సాయిబాబా నిజజీవిత సంఘటనల ఆధారంగా, ఇంతవరకూ రాని కొత్త అంశాలను మేళవించి 'జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబు' చిత్రాన్ని బి.వి.రెడ్డి నిర్మించారు. ఇందులో సాయిబాబాగా టైటిల్ పాత్రను ఆయన స్వయంగా పోషించడం విశేషం. జి.రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది.
'జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా' చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి అనుకున్న విధంగానే అనుకున్న సమయంలో పూర్తి చేశామనీ, అన్నివర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం అలరిస్తుందీ బి.వి.రెడ్డి తెలిపారు. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ వారు 'యు' సర్టిఫికెట్ ఇచ్చారనీ, మంచి సినిమా తీశారంటూ సెన్సార్ సభ్యులు అభినందించడం తమకెంతో సంతోషం కలిగించిందనీ తెలిపారు. అతి త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. మంచి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పనిసరిగా ఆదరిస్తారనే నమ్మకం తనకుందని దర్శకుడు రామకృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, నాగబాబు, బ్రహ్మాజీ, శివకృష్ణ, నారాయణరావు, రమాప్రభ, శివపార్వతి, రామిరెడ్డి, రఘునాథరెడ్డి, చిట్టిబాబు, గుండు హనుమంతరావు, దివ్య, ప్రియ, సారిక రామచంద్రరావు తదితరులు నటించారు. కొమ్మనాపల్లి గణపతిరావు మాటలు, కె.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, మేనఘ శ్రీను ఎడిటింగ్, లలిత్ సురేష్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|