'కంత్రి' కాంబినేషన్ మరోసారి
ఎన్టీఆర్, అశ్వనీదత్, మెహర్ రమేష్ కాంబినేషన్ అనగానే 'కంత్రి' చిత్రం గుర్తుకొస్తుంది. ఆ చిత్రం కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించపోయినా ఎన్టీఆర్ ను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో మెహర్ రమేష్ సక్సెస్ అయ్యారు. ఎక్కడా రాజీపడకుండా అగ్రనిర్మాత సి.అశ్వనీదత్ ఆ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ ఈ త్రిమూర్తుల కాంబినేషన్ లో కొత్త చిత్రానికి బుధవారంనాడు శ్రీకారం చుట్టారు. హైద్రాబాద్ లోని వైజయంతీ మూవీస్ సంస్థ కార్యాలయంలో నిరాడంబరంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.
'కంత్రి' తరహాలోనే ఎన్టీఆర్ ను ఈ చిత్రంలో కూడా మెహర్ రమేష్ వైవిధ్యంగా చూపించబోతున్నారనీ, 'బిల్లా' తరహా స్టయిలిష్ చిత్రంగా ఈ సినిమా ఉంటబోతోందనీ తెలుస్తోంది. మెహర్ రమేష్ చెప్పిన కథ వినగానే ఎన్టీఆర్ ఎంతో ఇప్రెస్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని నిర్మిస్తున్న 'అదుర్స్' చిత్రం షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తికాగానే సెప్టెంబర్ నుండి కం'త్రి' కాంబినేషన్ చిత్రం సెట్స్ పైకి వస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Be first to comment on this News / Article!
|