'స్వీట్ హార్ట్'కు ఆదరణ
ఒక కొత్త పాయింట్ తో తీసిన 'స్వీట్ హార్ట్' చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోందనీ ఆ చిత్ర కథానాయకుడు, దర్శకుడు ఆకాష్ పేర్కొన్నారు. దేవీ మూవీస్ పతాకంపై ఎస్.జె.రత్నావత్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో ఈ చిత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు.
నటుడిగా ఇంతవరకూ ప్రేక్షకాదరణ చూరగొంటున్న తాను తొలిసారి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరియయ్యాననీ, ప్రేక్షకులు సైతం ఇటు నటుడిగా, అటు దర్శకుడిగా తనకు మంచి మార్కులు వేయడం సంతోషంగా ఉందనీ ఆకాష్ పేర్కొన్నారు. ఈ చిత్రం చాలా బాగుందని శ్రీనువైట్ల ప్రశంసించడం తనకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. మంచి టాక్ రావడంతో కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. నిర్మాత రత్నావత్ మాట్లాడుతూ, కథే హీరోగా రూపొందిన చిత్రమిదనీ, మూడు కోణాలు కలిగిన ఆకాశ్ పాత్రకు మంచి స్పందన లభిస్తోందన్నారు. మరింత మంది ప్రేక్షకులకు సినిమా చేరువ చేసేందుకు రెండో వారం నుంచి పబ్లిసిటీని మరింత పెంచుతున్నట్టు తెలిపారు.
Be first to comment on this News / Article!
|