నయన నయా అవతారం
తమిళ 'బిల్లా' చిత్రంతో కోటి పాతిక లక్షల పారితోషికానికి చేరుకున్న నయనతార అదో కోవలో తన అందంచందాల ప్రదర్శనతో అలరించిన చిత్రమే 'ఏగన్'. ఈ చిత్రాన్ని ఇప్పుడు 'మల్లిక ఐ లవ్ యూ' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. అజిత్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నృత్య దర్శకుడు రాజు సుందరం తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. దీనిని స్నేహల్ ఇంటర్నేషనల్ మూవీస్ సంస్థ తెలుగులోకి అనువదిస్తోంది.
అక్రమ మార్గంలో తండ్రి సంపాదించిన డబ్బుని పిల్లలు తిరస్కరిస్తే పరిణామాలు ఏమిటన్నది ఈ చిత్ర కథ అనీ, అజిత్ పోలీస్ ఆఫీసర్ గా, నవదీప్ స్టూడెంట్ గా నటించినట్టు నిర్మాత వాగిచర్ల మురళీ కృష్ణ తెలిపారు. టీచర్ గా నయనతార గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. మలయాళ హీరో జయరాం పాత్ర చక్కటి వినోదాన్ని అందిస్తుందని చెప్పారు. యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఆరు పాటలు అలరిస్తాయనీ, వీటిలో రెండింటిని స్విట్జర్లాండ్ లో చిత్రీకరించారనీ తెలిపారు. 20 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, సుమన్ విలన్ గా నటించారనీ సహ నిర్మాత ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో దేవన్, ప్రీతీ వాజ్ పేయి తదితరులు నటించారు. రాజశేఖర్ రెడ్డి మాటలు, పొందూరి పాటలు అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|