యోగా గురు 'ఓ మైగాడ్'
ఒక టీ దుకాణాన్ని నడిపే సాధారణ యువకుడు అద్భుతమైన వ్యక్తిగా 'ఓ మై గాడ్' అనుకునే స్థాయికి ఎదుగుతాడు. ఈ కథతో 'ఓ మై గాడ్' చిత్రం రూపొందుతోంది, యోగా గురువుగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కమల్ కథానాయకుడుగా గిరిధర్ గోపాల్ దర్శకత్వంలో వైట్ లోటస్ పతాకంపై సేతు మాధవన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ లో భాగంగా కీలమైన ఫైట్స్ ను రామానాయుడు సినీ విలేజ్ లో చిత్రీకరిస్తున్నారు. థాయ్ లాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్ జైకా ఆధ్వర్యంలో ఫైట్స్ చిత్రీకరణ జరుగుతోంది.
శంకరాచార్య అద్యైతకు యాక్షన్ పార్ట్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు గిరిధర్ గోపాల్ తెలిపారు. భగవంతుడంటే ఏమిటో ఈ సినిమా చెబుతుందనీ, అద్వైత తత్వాన్ని తెలిపే పాట ఈ చిత్రంలో ఆకట్టుకుంటుందనీ చెప్పారు. పూర్తి స్థాయి యాక్షన్ మూవీ ఇదనీ, మధ్యలో కమల్ ప్రమాదాల బారిన పడటం వల్ల షూటింగ్ కు గ్యాప్ వచ్చిందనీ అన్నారు. ఇరవై ఏళ్లుగా పరిశ్రమతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఈ చిత్రంతో తాను దర్శకుడిగా మారననీ, ఆగస్టు లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నామనీ చెప్పారు. కమల్ మాట్లాడుతూ, తెలుగువాడినైన తాను హాంకాంక్, సింగపూర్ లో యోగా గురువుగా స్థిరపడ్డాననీ, మాతృదేశం మీద అభిమనంతో ఇక్కడి సినిమాలో నటించడానికి ఎంతో ఆసక్తిగా వచ్చాననీ చెప్పారు. ఇందులో అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ వెపన్స్ చూపించనున్నామనీ, యాక్షన్ సన్నివేశాలన్నీ అత్యంత సహజంగా ఉంటాయనీ చెప్పారు. తన శిష్యుడు సేతు మాధవన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ, భారతదేశంలోనే అత్యున్నత చిత్రంగా తీర్చిదిద్దుతున్నారనీ ప్రశంసించారు. యువతరానికి స్ఫూర్తి నిచ్చే ఈ చిత్రాన్ని ఇండియాతో పాటు మలేసియా, సింగపూర్, హాంకాంగ్ లలో కూడా విడుదల చేయనున్నామని అన్నారు. గొప్ప మార్షల్ ఆర్ట్స్ యోధుడు, యోగా గురువు అయిన కమల్ తో సినిమా నిర్మిస్తుండటం తనకెంతో సంతోషంగా ఉందని సేతుమాధవన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చిత్రానికి పనిచేసే అవకాశం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|