220 కేంద్రాల్లో హాఫ్ 'కిక్'
ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో వచ్చిన 'అరుంధతి' తర్వాత సమ్మర్ సీజన్ లో ఘనవిజయం సాధించిన చిత్రంగా 'కిక్' నమోదైంది. రవితేజ, ఇలియానా జటంగా కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారంతో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పై బ్యానర్ లో ఇంతవరకూ విడుదలైన చిత్రాలన్నింటిలోనూ 'కిక్' అతి పెద్ద హిట్ గా నిలిచిందనీ, అంతర్జాతీయంగా 220 కేంద్రాల్లలో, రాష్ట్ర వ్యాప్తంగా 200 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుందని అచ్చిరెడ్డి తెలిపారు. రవితేజ నటన, ఇలియానా గ్లామర్, సురేందర్ రెడ్డి టేకింగ్...ఇలా సమష్టి కృషికి ప్రేక్షకులు ఘనవిజయంతో పట్టం కట్టారనీ అన్నారు. ఈ చిత్రం అర్ధ శతదినోత్సవాన్ని, ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను యూనిట్ సభ్యుల మధ్య హైద్రాబాద్ లో నిర్వహిస్తామని చెప్పారు. రవితేజ నటించిన గత చిత్రాల రికార్డులను ఈ చిత్రం కేవలం 4 వారాల్లోనే బ్రేక్ చేసిందనీ, అలాగే అర్.ఆర్.మూవీస్ బ్యానర్ కు ఈ చిత్ర విజయం మంచి 'కిక్' ఇచ్చిందనీ సహనిర్మాత వి.సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన యూనిట్ కూ, ప్రేక్షకులకూ నిర్మాత వెంకట్ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Be first to comment on this News / Article!
|