యూరప్ కు వెంకీ-త్రిష
విక్టరీ వెంకటేష్, సోయగాల సుందరి త్రిష రెండోసారి జత కడుతున్న చిత్రం 'నమో వెంకటేశ'. శ్రీనువైట్ల దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో '14 రీస్ ఎంటర్ టైన్ మెంట్స్' పతాకంపై అనిల్ సుంకర, ఆచంట గోపీనాథ్, ఆచంట రామ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గోపీ మోహన్ అందించిన కథ అందించగా, కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. గత వారంలోనే పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. నెలరోజుల కీలక షెడ్యూల్ కోసం వెంకటేష్, త్రిష, తదితర యూనిట్ సభ్యులు త్వరలోనే యూరప్ బయలు దేరుతున్నారు. ఇక్కడ కొంత టాకీ, కొన్ని పాటల చిత్రీకరణ కూడా జరుపనున్నట్టు తెలుస్తోంది.
త్రిష ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన ప్రియదర్శన్ దర్శకత్వంలో 'ఖట్టా మీటా' చిత్రానికి కమిట్ అయింది. ఇది త్రిష తొలిసారిగా హిందీలో నటిస్తున్న చిత్రం కావడం విశేషం. తమిళంలో త్రిషను పరిచయం చేసిన ప్రియదర్శన్ దర్శకత్వంలోనే ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, అక్షయ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించనుండటం విశేషం. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీ చిత్రం ప్రారంభానికి ముందే వెంకటేష్-త్రిష కాంబిషన్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువస్తున్నారు. 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే' వంటి హిట్ చిత్రం తర్వాత వెంకటేష్, త్రిష కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించనున్న చిత్రంలో వెంకటేష్ పనిచేయబోతున్నారు. ఈ చిత్రానికి కూడా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి.
Be first to comment on this News / Article!
|