స్నేహకూ శ్యామ్ కూ మధ్య...
గ్లామర్ తో పాటు ఫ్యామిలీ క్యారెక్టర్లను సమర్ధవంతంగా పోషించి మెప్పించగలిగిన నటి స్నేహ, 'కిక్' చిత్రంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న శ్యామ్ జంటగా నటించిన చిత్రం 'నీలో..నాలో'. దీనికి 'బిట్వీన్ యు అండ్ మి' అనే ట్యాగ్ లైన్ ఉంది. నైన్త్ ఛానల్ పతాకంపై నందు దర్శకత్వంలో విజయశ్రీ నందకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
నిర్మాత నందకుమార్ మాట్లాడుతూ, ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన చిత్రమిదని, అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందనీ తెలిపారు. 'కిక్' శ్యామ్ నటన, స్నేహ గ్లామర్, బాలాజీ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటాయని చెప్పారు. జూలై 3న మధుర ఎంటర్ టైన్ మెంట్ ద్వారా ఆడియో, ఆ నెలాఖరులోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సునీల్, రేఖ, అరుణ్ పాండ్యన్, జూనియర్ రేలంగి తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|