'తేజం' పాటల సక్సెస్
సినిమా విడుదలకు ముందు ఆడియో విడుదల చేయడం రివాజు. ఆడియో హిట్టయితే సినిమా సగం హిట్ సాధించినట్టేనని ఫిల్మ్ మేకర్స్ భావిస్తుంటారు. ఇటీవల కాలంలో ఆడియో విడుదల తర్వాత మరో కార్యక్రమం కూడా ఆనవాయితీ మారుతోంది. ఆడియో సక్సెస్ మీట్ లు కూడా జరుపుతున్నారు. గతవారంలోనే 'వెంగమాంబ' ఆడియోపై స్పందన కార్యక్రమాన్నిఆ చిత్రయూనిట్ నిర్వహిచింది. తాజాగా అంతా కొత్త తారాగణంతో సన్ రైజ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ 'తేజం' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాజ్.కె.ఎస్.గోపి దర్శకత్వంలో ఎస్.రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకొంటోది. ఇటీవలే మైత్రి సంస్థ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది. ఈ ఆడియో సక్సెస్ మీట్ ను హైద్రాబాద్ లో శుక్రవారం రాత్రి నిర్వహించారు. దర్శక నిర్మాతలతో పాటు గీత రచయితలు శివ, శివరీష్, రాఖేష్ కన్నా, హీరో సర్దార్, హీరోయిన్ మౌనిక, ఛాయాగ్రాహకుడు నాగేంద్రకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తారాలు కొత్తవారైనా మంచి కథాబలంతో వచ్చిన చిత్రాలకు ప్రేక్షకులు పట్టంకడుతున్నారనీ, తమ చిత్రం కూడా ఇదే కోవలో కొత్త తారలతో రూపొందించామనీ దర్శక నిర్మాతలు తెలిపారు. నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని తెలిపారు. గణ అనే నూతన సంగీత దర్శకుడిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామనీ, సినిమాలోని అన్ని పాటలకు అద్భుతమైన బాణీలు ఇచ్చారనీ, ఇటీవల విడుదలైన ఆడియో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోందనీ చెప్పారు. ఆడియో సక్సెస్ కావడం సినిమాపై తమ నమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. జూలైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
Be first to comment on this News / Article!
|