ఆర్తి 'నీలవేణి' ప్రారంభం
ఆర్తి అగర్వాల్ టైటిల్ పాత్రలో 'నీలవేణి' అనే కొత్త చిత్రం ప్రారంభమైంది. ఆర్తికి జోడిగా బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ నటిస్తున్నారు. భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఎం.జి.ఆర్.కంబైన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆర్తి, ముకుల్ దేవ్ పై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి డాక్టర్ డి.రామానాయుడు క్లాప్ ఇవ్వగా, డి.సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రమనీ, చదువుకుంటూ ప్రేమించిన వాడితో జీవితంలో స్థిరపడాల్సిన ఓ అమ్మాయి ఆదిశక్తిగా ఎందుకు మారాల్సి వచ్చిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తమనీ భరత్ పారేపల్లి చెప్పారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం చేస్తామని చెప్పారు. సాధారణంగా ప్రేమ విచ్ఛినానికి అనేక కారణాలుంటాయనీ, ఈ ప్రేమకథలో ప్రేమ విచ్ఛిన్నానికి రాజ్యాంగం ఎలా కారణమైందనేది ఆసక్తికరంగా ఉంటుందని మాటల రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు పేర్కొన్నారు. ముకుల్ దేవ్ మాట్లాడుతూ, బాలీవుడ్ నటుడినైన తనకు తెలుగు మంచి అవకాశాలు వస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ, ఇదొక చక్కటి ప్రేమకథా చిత్రమనీ ముకుల్ దేవ్ అన్నారు. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో ఇంత మంచి చిత్రం రావడం ఆనందంగా ఉందనీ, ఈ చిత్రం తనకు మంచి బ్రేక్ నిస్తుందనే నమ్మకంతో ఉన్నాననీ ఆర్తి అగర్వాల్ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇత పాత్రల్లో పోసాని కృష్ణమురళి, ఆదిత్య ఓం, ఎంఎస్ నారాయణ, రవికాలే, కాటరాజు, రవిప్రకాష్, హర్షవర్దన్, శ్రీనివాస్, శివపార్వతి, గీతాసింగ్, ద్రాక్షారామం సరోజిని, అంజిలి, సత్యప్రియ తదితరులు నటిస్తున్నారు. కొమ్మనాపల్లి మాటలు, ఎ.ఆర్.బాబు సినిమాటోగ్రఫీ, లలిత్ సురేష్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|