'మగధీర' ఆడియో రిలీజ్
ఇక నుంచి ఏటా రెండు చిత్రాలు
'మగధీర' చిత్రం రిలీజ్ తేదీలో జాప్యం వల్ల కొద్దిగా మనస్థాపం చెందిన మాట నిజమే అయినా, సినిమా చాలా బాగా రావడం ఎంతో సంతోషం కలిగించిందని రామ్ చరణ్ పేర్కొన్నారు. తెలుగువారు గర్వంగా చెప్పుకోదగిన సినిమా ఇదన్నారు. కీరవాణి సంగీతం అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ముఖ్యంగా ఆయన ఇచ్చే మెలోడీలు తనకెంతో ఇష్టమనీ అన్నారు. 'బంగారు కోడిపెట్ట' పాటను తాను చాలా సార్లు చూశాననీ, నాన్నగారు చేసిన దాంట్లో పది శాతం చేసినా తాను ఆ పాటకు న్యాయం చేసినట్టుగా భావిస్తాననీ అన్నారు. ఇది పౌరాణిక చిత్రం ఎంత మాత్రం కాదనీ, యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమకథా ఇతివృత్తమనీ అన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని అన్నారు. వచ్చే ఏడాది నుంచి రెండు సినిమాలు విడుదలయ్యేలా తాను ప్లాన్ చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
పుట్టింటికి వచ్చినట్టుంది...
ఆడపిల్ల అత్తవారింటి నుంచి పుట్టింటికి వస్తే ఎలాంటి అనుభూతి పొందుతుందో అలాంటి అనుభూతిని తాను ఈ ఫంక్షన్ లో పాల్గొనడం ద్వారా పొందుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా అయినా, రాజకీయాలైనా కష్టాన్నే తాను ఎప్పుడూ నమ్మూతూ ఉంటాననీ అన్నారు. సినిమా పరిశ్రమకు భిన్నమైన రంగం రాజకీయాలని అన్నారు. తాను సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించలేదనీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదనీ అన్నారు. గతంలో తాను 'మగధీరుడు' సినిమా చేశాననీ, ఈ చిత్రానికి 'మగధీర' అనే టైటిల్ ఎంపిక చేసుకోవడం యాదృచ్ఛికం కావచ్చనీ అన్నారు. కీరవాణి ఎంతో టాలెంట్ ఉన్న సంగీత దర్శకుడని ప్రశంసించారు. ఈ చిత్రంలోని ఓ పాటలో కొన్ని సెకెండ్ల పాటు తాను కనిపిస్తానని చెప్పారు. పునర్జన్మల కథాంశంతో సినిమాలు వచ్చి చాలా కాలమే అయిందనీ, విజువల్ పొయిట్రీ గా ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారనీ అన్నారు. ఈ చిత్రంలో చరణ్ స్టెప్పులు, నటన చూసి తనకు కొంత జలసీ కలిగిందంటూ చమత్కరించారు. అల్లు అరవింద్ ఎక్కడా రాజీపడకుండా చాలా పెద్ద మొత్తాన్ని ఈ సినిమాకి ఖర్చు పెట్టారని అన్నారు. అభిమానుల ప్రోత్సహమే చరణ్ కు శ్రీరామరక్ష అవుతుందని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|