బ్రాహ్మణికి శాంటాక్లారా డిగ్రీ
నందమూరి బాలకృష్ణ కుమార్తె, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కోడలు బ్రాహ్మణి కాలిఫోర్నియాలోని శాంటాక్లారా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసి డిస్టింక్షన్ సాధించారు. అంతేగాకుండా యూనివర్శిలో మూడు అవార్డులు కూడా ఆమె అందుకున్నారు.
ఎలక్ట్రికల్ ఇందనీరింగ్ లో ఇచ్చే హయ్యస్ట్ జి.పి.ఎ. అవార్డు, ఉత్తమ విద్యార్థికిచ్చే 'సమ్మా కమ్ లాడ్' అవార్డు బ్రాహ్మణికి దక్కాయి. అలాగే బ్రాహ్మణి గ్రూప్ తయారు చేసిన ప్రాజెక్ట్ కు కూడా మొదటి బహుమతి లభించింది. బ్రాహ్మణి డిగ్రీతో పాటు అవార్డులు అందుకున్న కార్యక్రమంలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞ, రెండవ కుమర్తె తేజస్విని, చంద్రబాబునాయుడు, నారా లోకేష్, భువనేశ్వరి తదితరులు మోక్షజ్ఞను అభినందించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|