'రెచ్చిపో' లోగో ఆవిష్కరణ
నితిన్, ఇలియానా జంటగా పరుచూరి మురళి దర్శకత్వంలో స్పెక్ట్రా మీడియా పతంకాపై జి.వి.రమణ నిర్మిస్తున్న చిత్రానికి 'రెచ్చిపో' అనే టైటిల్ లను ప్రకటించారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారంనాడు ఫిలిం ఛాంబర్ లో జరిగింది. నిర్మాత కుమార్తె లత ఈ లోగోను ఆవిష్కరించారు. నితిన్, పరుచూరి మురళి, సుధాకర్ రెడ్డి, రమేష్-గోపి, రఘుబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నితిన్ మాట్లాడుతూ, ఈ చిత్రం కోసం యూనిట్ అంతా ఎంతో కష్టపడ్డారనీ, గల్ఫ్ ఎడారిలో 45 రోజుల పాటు షూటింగ్ జరిపామనీ చెప్పారు. ఇందులో తాను చాలా వైవిధ్యంగా కనిపిస్తానని అన్నారు. రెంజు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయిందనీ చెప్పారు. ఈ చిత్రంలో రఘుబాబు పాత్ర చాలా బాగుంటుందనీ, అతని నంది అవార్డు వస్తుందనీ అన్నారు. సినిమా ప్రథమార్థం ఇండియాలో, ద్వితీయార్ధం గల్ఫ్ లో ఉంటుందనీ, పాకిస్తాన్, ఆర్మీనియా, సూడాన్ లలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి షూటింగ్ జరిపామని రమేష్ తెలిపారు. రఘుబాబు మాట్లాడుతూ, ఇందులో క్యారెక్టర్ పరంగా తాను ఎడారిలో హీరోహీరోయిన్ల లగేజ్ మోస్తుంటానని అన్నారు. ప్రేక్షకులను అలరించే అనేక అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సునీల్, భానుచందర్, షావర్ అలీ, ఆహుతి ప్రసాద్, తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రమాప్రభ, శ్రీలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|