సిడ్నీలో శరవేగంగా 'శంఖం'
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్, గ్లామరస్ నటి త్రిష జంటగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై 'శౌర్యం' శివ దర్శకత్వంలో జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శంఖం'. ఆస్ట్రేలియాలో ఈనెల 21 నుంచి శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గోపిచంద్, త్రిష, చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి, ధర్మవరపు సుబ్రమణ్యం, స్వాతి, రజిత, తెలంగాణ శకుంతల తదితరులు పాల్గొన్నంటున్న కీలక సన్నివేశాలను దర్శకుడు శివ చిత్రీకరిస్తున్నట్టు నిర్మాత భగవాన్ తెలిపారు. జూలై 10వ వరరూ సిడ్నీలో షూటింగ్ ఉంటుందని మరో నిర్మాత పుల్లారావు చెప్పారు. కథకు కీలకమైన దృశ్యాలతో పాటు గోపీచంద్-త్రిష జంటపై రెండు పాటల్ని ప్లాన్ చేశామనీ తెలిపారు. ఈనెల 29 నుంచి తీసే రెండు పాటల్లో ఓ పాటను సిడ్నీ, ఆ సమీప ప్రాంతాల్లో శోభి మాస్టర్ నృత్య దర్శకత్వంలో చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ఆలీ, కృష్ణభగవాన్, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, సీత, రాధాకుమారి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శివ కథ, అనీల్ రావిపూడి మాటలు, వెట్రి సినిమాటోగ్రఫీ, విజయ్, సెల్వ, గణేష్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, తమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|