శ్వేతబసు-వైభవ్ ల 'స్పీడ్'
'కొత్త బంగారులోకం', 'రైడ్' చిత్రాలతో హీరోయిన్ అయిన శ్వేత బసు ప్రసాద్ కెరీర్ స్పీడ్ అందుంది. ఆసక్తికరంగా శ్వేతబసు హీరోయిన్ గా నటిస్తున్న తదుపరి చిత్రానికి కూడా 'స్పీడ్' అనే టైటిల్ నే ఖరారు చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తన సొంత నిర్మాణ సంస్థ అయిన కె.ఫిలిమ్స్ పతాకంపై వైభవ్, శ్వేతబసు ప్రసాద్ జంటగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'స్పీడ్' అనే టైటిల్ దాదాపు ఖరారయినట్టేనని యూనిట్ వర్గాల సమాచారం.
కోదండరామిరెడ్డి తన తనయుడైన వైభవ్ ను 'గొడవ' చిత్రంతో అప్పట్లో హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని కోదండరామిరెడ్డి సొంత బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. అయితే ఈసారి మాత్రం ఆయన నిర్మాతగానే ఉంటున్నారు. ఈ చిత్రం ప్రథమార్థంలో బ్రహ్మానందం కామెడీ, ద్వితీయార్థంలో శ్వేతబసు పాత్ర హైలైట్ గా ఉంటాయని చెబుతున్నారు. ఇటీవల శ్వేతబసు నటించిన 'రైడ్' చిత్రం
ఆమెకు మంచి పేరు తేవడంతో దానికి దగ్గరగా ఉండేలా 'స్పీడ్' టైటిల్ ను దర్శకనిర్మాతలు ఎంచుకున్నారని తెలుస్తోంది. శ్వేతబసు తాజాగా ఉదయ్ కిరణ్ కొత్త చిత్రానికి, నిఖిల్ తో మరో చిత్రానికి హీరోయిన్ గా కమిట్ అయింది.
Be first to comment on this News / Article!
|