'నింగి నేల నాదే' వెబ్ సైట్
ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటే సాధంచలేనిది ఏదీ లేదనే సందేశం ఇచ్చే 'నింగి...నేల...నాదే' చిత్రం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆక్షాక్షించారు. పలు అవార్డులు రివార్డులు అందుకున్న చైనా చిత్రం 'ఇన్విజబుల్ వింగ్స్' ఇప్పుడు తెలుగులో 'నింగి నేల నాదే' పేరుతో అనువాదమై జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత చావ సుధారాణి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హైద్రాబాద్ లో ఆవిష్కరించారు.
ఒక పని తలబెడితే ఆ పనిని చివరి వరకూ పూర్తి చేసే స్థైర్యం ఉండాలని బర్తృహరి చెప్పారనీ, అలాంటి స్థైర్యం మెండుగా ఉన్న యువతే ఈ చిత్రంలోని కథానాయిక అని వై.ఎస్. అన్నారు. నేటి యువతరానికి అలాంటి ఆత్మవిశ్వాసనమే కావాలనీ, ఏదైనా సాధించాలనే పట్టుదల అవసరమనీ, అంగవైకల్యం అవరోధం కాదనే ధైర్యం కావాలని ఆయన ఉద్బోధించారు. చావా సుధారాణి మాట్లాడుతూ, ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ 'నింగి నేల నాదే' వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి తన కృతజ్ఞతలని అన్నారు. యువతరం ఈ చిత్రం నుంచి ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకోవాలన్నదే తమ కోరిక అని అన్నారు. తమను చూడగానే ఈ చిత్రం పేరు బాగుందంటూ ముఖ్యమంత్రి ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 'www.ninginelanaade.com'లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చని ఆమె చెప్పారు.
Be first to comment on this News / Article!
|