పెళ్లి పనుల్లో మీనా బిజీ
బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దక్షిణాదిన తన సత్తా చాటుకున్న మీననేత్రి మీనా వివాహం ఈనెల 12న తిరుపతిలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. బెంగుళూరుకు చెందిన ఐటి ప్రొఫెషనల్ విద్యాసాగర్ తో మీనా వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. తిరుపతిలో వివాహానంతరం చెన్నైలోని మేయర్ రామనాథన్ హాల్ లో గ్రాండ్ గా రెసెప్షన్ ఏర్పాటు చేశారు.
పెళ్లికి ఇంక కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మీనా పెళ్లి దుస్తులు, ఆభరణాల షాపింగ్ పనుల్లో బిజీగా కనిపిస్తోంది. రెండ్రోజుల క్రితమే తిరుపతి వెళ్లి శ్రీవారికి ప్రత్యేక పూజలు జరిపిన మినా వివాహ ఆహ్వాన తొలి పత్రికను స్వామివారి పాదాల ముందు ఉంచి ఆశీర్వాదం కోరారు. మీనా కాలినడకనే తొమ్మిది కిలోమీటర్ల తిరుపతి కొండను ఎక్కి స్వామి వారి సన్నిధిని చేరుకోవడం విశేషం. వివాహానంతరం కూడా మంచి పాత్రలు లభిస్తే నటనను కొనసాగిస్తాననీ, సినిమాలతో పాటు, బుల్లితెరపై నటించేందుకు కూడా తనకు అభ్యంతరాలు లేవనీ మీనా తెలిపింది.
Be first to comment on this News / Article!
|