'ఎ డిఫరెంట్ లవర్' రెడీ
హీరోగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆర్యన్ రాజేష్ 'రోమియో'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి 'ఎ డిఫరెంట్ లవర్' అనేది ట్యాగ్ లైన్. రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్ర పోషిస్తుండగా, ఆర్యన్ రాజేష్ కు జోడిగా గ్లామర్ నటి శ్రద్ధాదాస్ నటిస్తోంది. సుధ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి రామకృష్ణ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 3వ వారంలో విడుదల చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
మంచి కథాబలంతో ప్రేక్షకులను థ్రిల్ చేసే చిత్రమిదని దర్శకుడు రామకృష్ణ తెలిపారు. అనిల్ అంబానీ లాంటి ధనవంతుడైన వ్యక్తి పాత్రను శ్రీహరి పోషించగా, ఆయన చెల్లెలుగా శ్రద్ధఆర్య, ఆమెను ప్రేమించే యువకుడిగా ఆర్యన్ రాజేష్ నటించారనీ, హీరోయిన్ ప్రేమను హీరో ఎలా పొందగలిగాడన్నది చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుందనీ చెప్పారు. శ్రీహరికి ఆపోజిట్ విలన్ పాత్రలో చరణ్ రాజ్, శ్రీహరి పిఏ గా రఘుబాబు పోషించారనీ, పాటలతో పాటు మంచి ఫైట్స్ కూడా ఇందులో ఉన్నాయనీ చెప్పారు. శ్రీహరి-ఆర్యన్ రాజేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు, వారి నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఇటీవల మధుర ఎంటర్ టైన్ మెంట్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించినట్టు చెప్పారు. శ్రీహరి వంటి పెద్ద ఆర్టిస్టుతో, మంచి కథాబలం ఉన్న చిత్రంలో నటించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆర్యన్ రాజేష్ పేర్కొన్నారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ప్రేమ పట్ల నమ్మకం కలిగిన అమ్మాయి పాత్ర తనదని శ్రద్ధాఆర్య తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సంతోష్ పవన్, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, గౌతంరాజు, సైరాభాను, వైజాగ్ ప్రసాద్, హర్షవర్దన్ తదితరులు నటించారు. వనమాలి పాటలు, రాజేంద్ర సినిమాటోగ్రఫీ, శంకర్ ఎడిటింగ్, గణేష్-సతీష్ ఫైట్స్, అగస్త్య సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|