నారా వారి 'బాణం'
సినీ రంగానికి వారసుల ప్రవేశం కొత్త కాదు. నాగార్జున తనయుడు నాగచైతన్య 'జోష్' తోనూ, డి.సురేష్ బాబు తనయుడు రానా (రామానాయుడు) శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లీడర్' చిత్రంతోనూ హీరోలుగా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా రాజకీయ వారసత్వం ఉన్న నారా రోహిత్ సైతం హీరోగా పరిచయం కాబోతున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రనాయుడు సోదరుడైన నారా రామ్మూర్తినాయుడి కుమారుడే రోహిత్. మహేష్ ను 'రాజకుమారుడు', అల్లు అర్జున్ ను 'గంగోత్రి' చిత్రాల ద్వారా పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ తన వైజయంతీ మూవీస్ పతాకంపై నారా రోహిత్ తొలి చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా దంతులూరి చైతన్య దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి 'బాణం' అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది.
రోహితి సరసన ఓ కొత్తమ్మాయిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ నెలలోనే నందమూరి హీరోలందరి సమక్షంలో గ్రాండ్ గా ఈ చిత్ర ప్రారంభోత్సావాన్ని ఇదే నెలలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంతో పాటు ఎన్టీఆర్ కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రానికి అశ్వనీదత్ ఇటీవల పూజా కార్యక్రమాలు జరిపారు. సెప్టెంబర్ నుంచి ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
Be first to comment on this News / Article!
|