నాగచైతన్య జోష్ ఆగస్టు 12
నాగార్జున ఫ్యామిలీ నుంచి సుమంత్, సుశాంత్ ఇప్పటికే హీరోలుగా నిలదొక్కుకోగా ఇప్పుడు ఆయన తనయుడు నాగచైతన్య సైతం 'జోష్' చిత్రం ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా వరుస విజయాలు సొంతం చేసుకుంటున్న దిల్ రాజు తన సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వాసు వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగచైతన్యకు జోడిగా సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేస్తోంది. దిల్ రాజు గత చిత్రాల కంటే మిన్నగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.
గోల్డెన్ టెంపుల్ సిటీ అమృత్ సర్ లో ఇటీవల కీలకమైన ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని మెహదీపట్నంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇక్కడి ఎన్టీఆర్ నివాసం ఎదురుగా ఓ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను తాజాగా చిత్రీకరిస్తున్నారు. నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆగస్టు 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దిల్ రాజు తొలుత ప్లాన్ చేశారనీ, అయితే సినిమాపై ఎక్కువ అంచనాలకు తావీయకుండా వేరే తేదీని ఎంపిక చేయాలని నాగార్జున సూచించారనీ తెలుస్తోంది. దీంతో ఆగస్టు 12న 'జోష్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని దిల్ రాజు పట్టుదలగా ఉన్నారు. సందీప్ చౌతా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఈ నెలాఖరులో విడుదలవుతుంది.
Be first to comment on this News / Article!
|